TSPSC New Chairman: టీఎస్‌పీఎస్సీ కొత్త సారధి ఆయనేనా..? తెరపైకి కొత్త బోర్డు సభ్యుల పేర్లు..

| Edited By: Srilakshmi C

Jan 10, 2024 | 6:53 PM

నిరుద్యోగుల ఎదురుచూస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు మార్గం సుగమైంది. చైర్మన్ సహా సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో టీఎస్‌పీఎస్సీ కొత్త చైర్మన్ ఏర్పాటుపై సర్కారు దృష్టి పెట్టింది. చైర్మన్ రేసులో పలువురు మాజీ ఐఏఎస్, ఐఏఎస్ ల పేర్లు వినిపిస్తుండగా.. సభ్యులుగా ఎవరిని ప్రభుత్వం నియమిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించడంతో..

TSPSC New Chairman: టీఎస్‌పీఎస్సీ కొత్త సారధి ఆయనేనా..? తెరపైకి కొత్త బోర్డు సభ్యుల పేర్లు..
TSPSC
Follow us on

హైదరాబాద్‌, జనవరి 10: నిరుద్యోగుల ఎదురుచూస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు మార్గం సుగమైంది. చైర్మన్ సహా సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో టీఎస్‌పీఎస్సీ కొత్త చైర్మన్ ఏర్పాటుపై సర్కారు దృష్టి పెట్టింది. చైర్మన్ రేసులో పలువురు మాజీ ఐఏఎస్, ఐఏఎస్ ల పేర్లు వినిపిస్తుండగా.. సభ్యులుగా ఎవరిని ప్రభుత్వం నియమిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించడంతో ఇప్పుడు అందరి దృష్టి కొత్త చైర్మన్ ఎవరన్న దానిపైనే ఉంది. ఇప్పటికే టీఎస్ పీఎస్ సీ ప్రక్షాళన కోసం కసరత్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పటికే యూపీఎస్సీ, ఇతర రాష్ట్రల సర్వీస్ కమిషన్లను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న అంశంపై తీవ్ర కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను సర్కారు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆకునూరి మురళి, ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్యార్, వాణిప్రసాద్ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత ఈ పదవిని స్వీకరించేందుకు కొందరు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చింది. అందులో భాగంగా వీలైనంత త్వరగా టీఎస్ పీఎస్ సీని ప్రక్షాళన చేసి.. కొత్త కమిషన్ తో ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కమిషన్ లేకపోవడంతో గ్రూప్ -2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మరికొన్ని నోటిఫికేషన్లు వెలువడి ఎగ్జామ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కమిషన్ ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది.

మరోవైపు గతంలో పేపర్ లీకేజీ ఘటనతో అప్రతిష్ఠపాలైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళనలో భాగంగా బోర్డులో సభ్యుల సంఖ్యను సైతం పెంచాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్ పీఎస్ సీ చైర్మన్ సహా 11 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటుకను త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. జనవరి చివరి నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గ్రూప్ పరీక్షలు, ఇతర విభాగాల ఎగ్జామ్స్ అన్ని కొత్త బోర్డు ఏర్పాటు తర్వాత ఇప్పటికే అధ్యయనం చేసిన యూపీఎస్ సీ పరీక్షలన నిర్వహణ మాదిరి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. టీఎస్ పీఎస్ సీ చైర్మన్ రేస్ లో మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్ సర్కారు త్వరలోనే క్లారిటి ఇవ్వబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.