Telangana: రాష్ట్రంలో కొనసాగుతున్న కొలువుల జాతర.. 2,440 ఉద్యోగాల భర్తీకి అనుమతి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

|

Jul 23, 2022 | 8:51 AM

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. విద్యాశాఖ, ఆర్కైవ్స్‌ అండ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్లలో 2,440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

Telangana: రాష్ట్రంలో కొనసాగుతున్న కొలువుల జాతర.. 2,440 ఉద్యోగాల భర్తీకి అనుమతి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Telangana
Follow us on

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు మరో సారి గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్.  మరి కొన్ని ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఓకే చెప్పింది. దాదాపు 2500 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ (Job Notification) జారీ కానుంది. అవును రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. విద్యాశాఖ, ఆర్కైవ్స్‌ అండ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్లలో 2,440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,392 మంది జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

ఇంటర్ విద్యలో 40 లైబ్రరీయన్‌, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, ఆర్కైవ్స్‌ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్లు, 14 ఇన్‌స్ట్రక్టర్లు, 31 లైబ్రరీయన్లు, 5 మాట్రన్‌, 25 ఎలక్ట్రిషీయన్లు, 37 పీడీ పోస్టులు, కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్‌ పోస్టులు, 24 లైబ్రరీయన్లు, 29 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్స్‌ రెయినింగ్‌ జాబ్స్‌ ఇన్‌ తెలంగాణ అంటూ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి తీపికబురు ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఇప్పటికే 49వేల 428 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు హరీష్‌ రావు. అందులో అత్యధికంగా పోలీస్‌ శాఖలో.. తర్వాత ఆరోగ్య శాఖలో భర్తీ చేసినట్లు లెక్కలు విడుదల చేశారు. ఇప్పుడు విడుదల చేసిన 2440 ఉద్యోగాలకు త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే గ్రూప్‌ 4 నోటిపికేషన్‌ ఇస్తారన్న ఆశలో ఉన్నారు నిరుద్యోగులు. దీంతో కోచింగ్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. వేలాది మంది అభ్యర్థులు ప్రభుత్వ కొలువుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్ & ఉద్యోగాలు వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి,