అగ్ని ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే తలంపుతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లతోపాటు 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ నేడు జీ.ఓ. ఎం.ఎస్ నెంబర్ 64 ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు కాగా, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతినిచ్చారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసన సభ నియోజక వర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..