పోలీసు అభ్యర్థుల వయోపరిమితి రెండేళ్లు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు ఉద్యోగ నియామకాల్లో(TS Police Recruitment 2022) అభ్యర్థుల వయోపరిమితి పెంచారు. అభ్యర్థుల వయోపరిమితి రెండేళ్లు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వయోపరిమితి పెంపుపై తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదిలావుంటే.. నిరుద్యోగుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ సర్కార్ వయోపరిమితిని మూడేళ్ల పాటు పెంచింది. అయితే కనీసం ఐదేళ్లయినా పెంచాలని నిరుద్యోగులకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 (సివిల్ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100 పోస్టులున్నాయి).. ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి.
అయితే మొదట్లో దరఖాస్తులు కొద్దిగానే వచ్చాయి ఆ తర్వాత లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతో మరింత మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి