Telangana: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎంసెట్ పేరు మారుస్తూ నిర్ణయం..

|

Jan 25, 2024 | 7:47 PM

టీఎస్‌ ఎంసెట్‌ను టీఎస్‌ ఈఏపీసెట్‌గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్‌ను.. ఈఏపీసీఈటీగా పేరు మార్చారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షతో పాటు మరో...

Telangana: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎంసెట్ పేరు మారుస్తూ నిర్ణయం..
Entrance Exams
Follow us on

తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తెలంగాణలో ఎంసెట్‌ పేరును మారుస్తున్నట్లు గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు పలు ప్రవేశ పరీక్షల తేదీని ప్రకటించాయి.

టీఎస్‌ ఎంసెట్‌ను టీఎస్‌ ఈఏపీసెట్‌గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్‌ను.. ఈఏపీసీఈటీగా పేరు మార్చారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షతో పాటు మరో 6 ప్రవేశ పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు. 2024- 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు.. నిర్వహించే యూనివర్సిటీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే తెలంగాణ ఈసెట్‌ పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నారు.

* జేఎన్‌టీయూ హైదరాబాద్‌ నిర్వహించే టీఎస్‌ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌)- మే 9 నుంచి 11 వరకు, (అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మా) మే 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు.

* మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌ – మే 23వ తేదీన నిర్వహించనున్నారు.

* ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే టీఎస్‌ లా సెట్‌; పీజీఎల్‌సెట్‌ జూన్‌ 3వ తేదీన నిర్వహిస్తారు.

* కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ను జూన్‌4,5వతేదీ ల్లో నిర్వహించనున్నారు.

* జేఎన్‌టీయూ హైదరాబాద్‌ నిర్వహించే టీఎస్‌ పీజీఈసెట్‌ జూన్‌ 6 నుంచి 8వరకు నిర్వహించనున్నారు.

* శాతవాహన యూనివర్సిటీ నిర్వహించే టీఎస్‌ పీఈసెట్‌ పరీక్షను జూన్‌ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తారు.

ఇదిలా ఉంటే పైన తెలిపిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్స్‌, షెడ్యూల్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజులకు సంబంధించిన వివరాలను ఆయా పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..