Civils Free Coaching: సివిల్స్ 2022 పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత కోచింగ్.. దరఖాస్తు తేదీ పొడిగింపు

|

Nov 22, 2021 | 7:22 PM

సివిల్స్ 2022 రాయాలని ఆసక్తి ఉన్న బీసి యువతకు ఇస్తున్న ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకునే తేదీని ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్టు బీసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

Civils Free Coaching: సివిల్స్  2022 పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత కోచింగ్.. దరఖాస్తు తేదీ పొడిగింపు
Telangana Bc Study Circle
Follow us on

Civils Free Coaching: సివిల్స్ 2022 రాయాలని ఆసక్తి ఉన్న బీసి యువతకు ఇస్తున్న ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకునే తేదీని ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్టు బీసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు నిపుణుల చేత కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తామని ఆయన వెల్లడించారు. సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 27 తేదీ లోగా వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040 24071178లో సంప్రదించాలని చెప్పారు.

Read Also… AP Capital: త్వరలోనే పకడ్భందీగా ఏపీ రాజధాని బిల్లు.. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!