TS Ayush Jobs: ఆయుష్ విభాగంలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని కమిషనర్ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రోగ్రాం ద్వారా, కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 159 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఆయుర్వేద (93), యునాని (17), హోమియోపతి (42), నేచురోపతి (07) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆయుర్వేద/ హోమియో/ యునాని విభాగాల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 44 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా కమిషనర్, ఆయుష్ విభాగం, సికింద్రాబాద్, తెలంగాణలో అందించాలి.
* అభ్యర్థులను యూజీ డిగ్రీ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎండీ అర్హత సాధించినవానికి ప్రాధాన్యత ఇస్తారు.
* దరఖాస్తు ఫీజుగా రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…