
Telangana Optional Holidays 2026 Full List
తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి ఆప్షనల్ సెలవుల జాబితాను తాజాగా విడుదల చేసింది. కొత్త సంవత్సరంలో పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే సెలవుల గురించి ఉద్యోగులకు ఆసక్తి పెరిగింది. సాధారణ ప్రభుత్వ సెలవులతో పాటు ఐచ్ఛిక సెలవుల తేదీలను తెలుసుకోవడం వల్ల ప్రయాణాలు, సొంత ఊళ్లకు వెళ్లడాన్ని మరింత సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను మొత్తం 26 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. ఏయే తేదీల్లో సెలవులు వచ్చాయో పూర్తి లిస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి..
తెలంగాణ ఆప్షనల్ సెలవుల 2026 ఫుల్ లిస్ట్ ఇదే..
- నూతన సంవత్సరం: జనవరి 1, 2026 (గురువారం)
- హజ్రత్ అలీ జయంతి: జనవరి 3, 2026 (శనివారం)
- కనుమ: జనవరి 16, 2026 (శుక్రవారం)
- షబ్-ఎ-మెరాజ్: జనవరి 17, 2026 (శనివారం)
- శ్రీ పంచమి: జనవరి 22, 2026 (శుక్రవారం)
- షబ్-ఎ-బరాత్: ఫిబ్రవరి 4, 2026 (బుధవారం)
- షహాదత్ హజ్రత్ అలీ (ర.అ.): మార్చి 10, 2026 (మంగళవారం)
- జుముఅతుల్ వదా: మార్చి 13, 2026 (శుక్రవారం)
- షబ్-ఎ-ఖద్ర్: మార్చి 17, 2026 (మంగళవారం)
- మహావీర్ జయంతి: 31-03-2026 (మంగళవారం)
- తమిళ నూతన సంవత్సరం: ఏప్రిల్ 14, 2026 (మంగళవారం)
- బసవ జయంతి: ఏప్రిల్ 20, 2026 (సోమవారం)
- బుద్ధ పూర్ణిమ: మే 1, 2026 (శుక్రవారం)
- ఈద్-ఎ-గదీర్: జూన్ 4, 2026 (గురువారం)
- మొహర్రం (1446H): జూన్ 25, 2026 (గురువారం)
- రథయాత్ర: జులై 16, 2026 (గురువారం)
- అర్బయీన్: సెప్టెంబర్ 4, 2026 (మంగళవారం)
- పార్సీ నూతన సంవత్సరం: ఆగస్ట్ 15, 2026 (శనివారం)
- వరలక్ష్మి వ్రతం: ఆగస్ట్ 21, 2026 (శుక్రవారం)
- శ్రావణ పూర్ణిమ / రాఖీ పూర్ణిమ: ఆగస్ట్ 28, 2026 (శుక్రవారం)
- యాజ్ దహుమ్ షరీఫ్: సెప్టెంబర్ 23, 2026 (బుధవారం)
- మహార్నవమి: అక్టోబర్ 18, 2026 (సోమవారం)
- హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మెహదీ మౌద్ జయంతి (అలైహిస్సలాం): అక్టోబర్ 18, 2026 (సోమవారం)
- నరక చతుర్దశి: నవంబర్ 8, 2026 (ఆదివారం)
- క్రిస్మస్ వేడుక: డిసెంబర్ 24, 2026 (గురువారం)
- హజ్రత్ అలీ జయంతి: డిసెంబర్ 26, 2026 (శనివారం)
మొత్తం 26 ఐచ్ఛిక సెలవులలో ఉద్యోగులు కేవలం ఏవైనా 5 రోజులను మాత్రమే ఆప్షనల్ సెలవుగా తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. అందువల్ల శని, ఆదివారాలు లేదంటే ఇతర సాధారణ సెలవులతో కలిపి వీటిని ఎంచుకోవడం ద్వారా ఉద్యోగులు ఎక్కువ రోజుల పాటు సెలవులు ఎంజాయ్ చేయవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.