TS 10th Exams: ముగిసిన తెలంగాణ టెన్త్‌ ఎగ్జామ్స్‌.. ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయంటే..

|

May 29, 2022 | 6:20 AM

TS 10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. శనివారం జరిగిన సాంఘిక పరీక్షతో పరీక్షలు ముగిశాయి. చివరి పరీక్షకు మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5029 మంది విద్యార్థులు...

TS 10th Exams: ముగిసిన తెలంగాణ టెన్త్‌ ఎగ్జామ్స్‌.. ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయంటే..
Follow us on

TS 10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. శనివారం జరిగిన సాంఘిక పరీక్షతో పరీక్షలు ముగిశాయి. చివరి పరీక్షకు మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5029 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఒకేషనల్ విద్యార్థులకు మాత్రం జూన్‌ 1న చివరి పరీక్ష జరగనుంది. పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో జూన్‌ 2 నుంచి స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభించనున్నారు అధికారులు. జూన్‌ 25 లోపు ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 23 ప్రారంభమైన విషయం తెలిసిందే. సాధారణంగా పదోతరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా, కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో 6 పేపర్లకు పరిమితం చేశారు. అంతేకాకుండా సిలబస్‌ను 30 శాతం కూడా తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ను పెంచేశారు. ఇక కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్‌ చేశారు.

అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈసారి పరీక్షల నిర్వహణ కోసం 2,861 కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 99 శాతం మంది హాజరయ్యారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..