TS SSC Results: కొనసాగుతోన్న తెలంగాణ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల వ్యాల్యుయేషన్‌.. ఫలితాలు ఎప్పుడంటే..

|

Jun 07, 2022 | 10:11 AM

TS SSC Results: కరోనా కారణంగా రెండేళ్లు ఒడిదొడకుల మధ్య సాగిన విద్యా సంవత్సరం ఈ ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసింది. కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో అధికారులు పరీక్షలను...

TS SSC Results: కొనసాగుతోన్న తెలంగాణ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల వ్యాల్యుయేషన్‌.. ఫలితాలు ఎప్పుడంటే..
Results
Follow us on

TS SSC Results: కరోనా కారణంగా రెండేళ్లు ఒడిదొడకుల మధ్య సాగిన విద్యా సంవత్సరం ఈ ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసింది. కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గడిచిన రెండేళ్లలో విద్యార్థులను నేరుగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసన నేపథ్యంలో తెలంగాణలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షా పత్రాల వ్యాల్యుయేషన్‌ శరవేగంగా కొనసాగుతోంది.

ఇంటర్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయింది. ఈ నెల 20లోగా ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే జూన్‌ 11 నాటికి పదో తరగతి వ్యాల్యుయేషన్‌ పూర్తి చేసి, నెలాఖరులోగా ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కరోనా కారణంగా విద్యార్థులపై పెరగిన ఒత్తిడి నేపథ్యంలో టెన్త్‌ విద్యార్థులకు 11 ప్రశ్నపత్రాలకు బదులు ఈసారి 6 మాత్రమే ఇచ్చారు. అలాగే పరీక్షల సమయాన్ని కూడా పెంచారు. అంతేకాకుండా ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలకు 70 శాతం సిలబస్‌ను ఇచ్చారు. మరి అధికారులు చేపట్టిన ఈ దిద్దుబాటు చర్యలు ఫలితాలపై ఏ మేరకు సానుకూల ప్రభావం చూపుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5,09,275ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..