Hyderabad Jobs: సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ విద్యా సంస్థలో టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కెమెస్ట్రీ, ఇంగ్లిష్, హిందీ, సోషల్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, యోగా, కంప్యూటర్ సైన్స్, స్పెషల్ ఎడ్యుకేటర్ విభాగాల్లో టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్ స్కోర్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, సికింద్రాబాద్ 500087 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను సీబీఎస్‌ఈ/ఏడబ్ల్యూఈఎస్ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.
* రూ. 100గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 17-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా స్టన్నింగ్ ఫొటోస్.. చూస్తే వావ్ అనాల్సిందే
Rashmika Mandanna: అందాలతో మాయ చేస్తున్న రష్మికా మండన్న లేటెస్ట్ ఫోటో గ్యాలరీ