నేటి విద్యా వ్యవస్థ యదార్థ చిత్రం ఇది: పరీక్ష విద్యార్థికి కాదు.. ఉపాధ్యాయుడికే! కాస్త మీరూ ఆలోచించండి..

ఒకప్పుడు పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థులు భయపడేవారు. కానీ నేడు సీన్ రివర్స్ అయింది. విద్యార్థి కంటే ఎక్కువగా ఉపాధ్యాయులే టెన్షన్ పడుతున్నారు. పరీక్ష నాదా? లేక విద్యార్థిదా? అన్నట్లుగా టీచర్ల పరిస్థితి మారిపోయింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ప్రస్తుత సమాజపు..

నేటి విద్యా వ్యవస్థ యదార్థ చిత్రం ఇది: పరీక్ష విద్యార్థికి కాదు.. ఉపాధ్యాయుడికే! కాస్త మీరూ ఆలోచించండి..
Decline In Student Participation In Education

Edited By:

Updated on: Mar 22, 2026 | 9:38 AM

హైదరాబాద్, మార్చి 22: నేటి విద్యా వ్యవస్థలో వింత పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థులు భయపడేవారు. కానీ నేడు సీన్ రివర్స్ అయింది. విద్యార్థి కంటే ఎక్కువగా ఉపాధ్యాయులే టెన్షన్ పడుతున్నారు. పరీక్ష నాదా? లేక విద్యార్థిదా? అన్నట్లుగా టీచర్ల పరిస్థితి మారిపోయింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ప్రస్తుత సమాజపు తీరుపై చర్చకు దారితీస్తోంది.

రాష్ట్ర ఫలితాల వేటలో ‘గురువుల’ తిప్పలు

విద్యా వ్యవస్థలో ప్రస్తుతం ఒక గొలుసుకట్టు ఒత్తిడి కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయి ఫలితాల కోసం ప్రభుత్వం ఆరాటపడుతోంది. జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు DEOలు ప్రయత్నిస్తున్నారు. తమ స్కూల్ 100% ఫలితాలు సాధించాలని హెడ్ మాస్టర్లు తపిస్తున్నారు. సబ్జెక్టు రిజల్ట్ కోసం రాత్రింబవళ్లు టీచర్లు కష్టపడుతున్నారు. కానీ ఈ క్రమంలో అసలు యుద్ధం చేయాల్సిన విద్యార్థి మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉండటం గమనార్హం. నాకేం అవసరం లేదు, టీచరే చూసుకుంటారులే.. అన్న ధీమాతో నేటితరం కొంతమంది విద్యార్థులు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని హాయిగా కాలక్షేపం చేస్తున్నారని ఆ పోస్ట్ వివరిస్తోంది.

సాగరసంగమం నాటి భయం.. నేటి ఉపాధ్యాయుడి వ్యథ

ప్రముఖ సినిమా సాగరసంగమంలో కమల్ హాసన్ బావి మీద డాన్స్ చేస్తుంటే.. ఆయన కంటే చూసే ప్రేక్షకులు ఎక్కువ భయపడతారట. సరిగ్గా నేటి విద్యా వ్యవస్థ కూడా అలాగే తయారైంది. విద్యార్థులు బాధ్యతారాహిత్యంగా ఉన్నా వారి భవిష్యత్తు గురించి, రిజల్ట్స్ గురించి ఉపాధ్యాయులు, అధికారులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఒకప్పుడు విద్యార్థులు భయపడి క్రమశిక్షణతో చదివేవారు. కానీ నేడు ఒత్తిడి మొత్తం ఉపాధ్యాయుల మీదకు నెట్టబడింది. కేవలం ఫలితాల కోసమే విద్యా వ్యవస్థ పనిచేయాలా? విద్యార్థిలో బాధ్యతను పెంచే విద్యా విధానం ఎప్పుడు వస్తుంది? విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. చదువు అనేది కేవలం టీచర్ల బాధ్యత మాత్రమే కాదు విద్యార్థి ప్రమేయం లేకుండా జ్ఞానం సిద్ధించదు అన్న వాస్తవాన్ని గుర్తించాలంటు సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us