TS Kendriya Vidyalayas: తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో 767 టీచర్‌ ఉద్యోగాలు.. త్వరలోనే..

|

Apr 05, 2022 | 7:44 AM

తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో 767 (47%), జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 76 (19%) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ..

TS Kendriya Vidyalayas: తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో 767 టీచర్‌ ఉద్యోగాలు.. త్వరలోనే..
Kvs
Follow us on

Telangana Kendriya Vidyalaya Schools 2022: తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో 767 (47%), జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 76 (19%) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణ దేవి సోమవారం (ఏప్రిల్‌ 4) తెలిపారు. లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35 కేంద్రీయ విద్యాలయాలున్నాయని, వీటిల్లో 39,418 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఈ స్కూళ్లకు 1,610 పోస్టులు మంజూరు చేయగా, ప్రస్తుతం 843 మందే పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇక 9 జవహర్‌ నవోదయ విద్యాలయా (jawahar navodaya vidyalaya)ల్లో 4,598 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఈ స్కూళ్లకు మంజూరు చేసిన 394 పోస్టుల్లో 318 మంది పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ ఖళీల భర్తీ త్వరలోనే చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Also Read:

NIPER JEE 2022 నోటిఫికేషన్‌ విడుదల! పరీక్ష ఎప్పుడంటే..