TISS Recruitment 2021: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకి చెందిన మంబయిలోని ఈ సంస్థ పలు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశంలోని పలు క్యాంపస్‌లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్ క్యాంపస్ కూడా ఉంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ముంబయి, తుల్జాపుర్, హైదరాబాద్, గువహటి క్యాంపస్‌లలో ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
* ఇందులో భాగంగా డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, హెల్త్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను ఆధారంగా సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 03-10-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: షాకింగ్.! జాతీయ రహదారిపై కుప్పలు తెప్పలుగా కండోమ్స్.. అసలు ఏమైందంటే.?
Mahesh Babu : మహేష్ బాబును మీట్ అయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. వైరల్ అవుతున్న వీడియో..
WhatsApp: నవంబర్ 1నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్ పని చేయదు.. ఇందులో మీ మొబైల్ ఉందేమో చూసుకోండి.