SVVU Recruitment 2021: ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. వేతనం రూ.17,500

|

Mar 09, 2021 | 6:03 PM

SVVU Recruitment 2021: ఏపీలో నిరుద్యోగులకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU)లో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్...

SVVU Recruitment 2021: ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. వేతనం రూ.17,500
Follow us on

SVVU Recruitment 2021: ఏపీలో నిరుద్యోగులకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU)లో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్‌ పద్దతిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న యూనివర్సిటీ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబరేటరీల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఏడాది పాటు కాంట్రాక్ట్‌ పద్దతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నెలకు రూ.17,500 వేతనం చెల్లించనున్నారు.

విద్యార్హతలు :

10వ తరగతి పాసైన వారితో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సులలో రెండేళ్ల డిప్లోమా కోర్సు చేసిన వారు దరఖాస్తు చేసుకునందుకు అర్హులు. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థులు సర్టిఫికేట్‌ పొంది ఉండాల్సి ఉంటుంది. ఏపీ పారామెడికల్‌ బోర్డు నుంచి గుర్తింపు పొంది ఉండాలి. 2020 జూలై 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 42 ఏళ్ల వయసు ఉండాలి. అయితే ఈ ఉద్యోగాల్లో దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో నడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు మూడేళ్ల పాటు వయోపరిమితి సడలింపు ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలు :

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 147 ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ప్రకటించారు. అనంతపురం 12, కర్నూలు 12, విజయనగరం 8, విశాఖపట్నం 9, శ్రీకాకుళం 9, కృష్ణా 12, ప్రకాశం 11, నెల్లూరు 8, చిత్తూరు 12, కడప 9, గుంటూరు 15, ఈస్ట్ గోదావరిలో 16, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 14 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఖాళీగా ఉన్న జిల్లాల్లో భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ఎలా చేయాలి..?

కాగా, అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200 ఉంటుంది. దరఖాస్తుతో పాటు విద్యార్హతల సర్టిఫికేట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 4 నుంచి 10వ రతగతి వరకు స్టడీ సర్టిఫికేట్‌, మెమోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను మార్చి 20వ తేదీ వరకు పంపించాలి. మార్చి 29న మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. డీఎంఎల్‌టీ కోర్సులో మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇవి చదవండి :

India-China: భారత్‌- చైనా దేశాల మధ్య శాంతిపర్వం నెలకొంటుందా..? ఇరు దేశాల మధ్య చర్చలకు ఎప్పుడు పుల్‌స్టాప్‌ పడుతుంది..?

ఒకే ఆరోపణపై నేరుగా సస్పెన్షన్‌ విధించడంలో అర్థం లేదు.. ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

TS ECET – 2021: టీఎస్ ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటివరకు స్వీకరిస్తారంటే..?