Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.లక్ష జీతం

సుప్రీం కోర్టు ఆఫ్‌ ఇండియా.. 2026-27 సంత్సరానికి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ కమ్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 90 లా క్లర్క్‌ కమ్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది..

Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.లక్ష జీతం
Supreme Court Law Clerk Cum Research Associate Recruitment

Updated on: Jan 21, 2026 | 2:39 PM

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆఫ్‌ ఇండియా.. 2026-27 సంత్సరానికి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ కమ్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 90 లా క్లర్క్‌ కమ్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 7, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత విభాగంలో లా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఫిబ్రవరి 7, 2026వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,00,000 చొప్పున జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.

సుప్రీంకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్నివిద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.