Supar Mom: మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి చేయూత ‘సూపర్ మామ్’.. గృహిణులకు గొప్ప సువర్ణావకాశం!

|

Dec 31, 2024 | 5:07 PM

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికి అవసరమైన రంగాల్లో నైపుణ్యాభివృద్దితో మహిళలను సన్నద్ధం చేయడానికి రూపొందించిన ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. సంవత్సరం పొడవునా ఉండే కార్యక్రమం. సూపర్ ప్రెసిడెంట్ సుధీర్ సండ్ర, వైస్ ప్రెసిడెంట్ నికీలు గుండా కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు..

Supar Mom: మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి చేయూత ‘సూపర్ మామ్’.. గృహిణులకు గొప్ప సువర్ణావకాశం!
Follow us on

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా తమదైన రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. టెక్నాలజీ ప్రపంచంలోనూ మహిళల పాత్ర చాలా కీలకం. ఇదిలా ఉండగా, మరోవైపు చాలా మంది మహిళలు ఉన్నత చదువులు చదివినా కుటుంబ బాధ్యతలు, సమయాభావం వల్ల తమ పరిజ్ఞానాన్ని, ప్రతిభను సరైన పద్దతిలో వినియోగించుకోలేపోతున్నారు. దీంతో ఆర్థిక స్వాతంత్ర్యానికి దూరమవుతున్నారు. ఇలాంటి వారికి చేయూతనిచ్చేందుకు ఆవిష్కృతమైంది సూపర్ మామ్ (SUPAR MOM). వివాహం తర్వాత బాధ్యతలతో ఉద్యోగాలు మానేసి, ఏం చేయాలో అర్థంకాని సందిగ్ధంలో ఉన్న అనేక మంది మహిళకు ఓ గొప్ప సువర్ణావకాశం కల్పిస్తోంది. నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక అక్షరాస్యతతో మహిళా సాధికారత సాధించేందుకు సూపర్ ఫౌండేషన్ (SUPAR Foundation) “సూపర్ మామ్” (SUPAR MOM) అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికి అవసరమైన రంగాల్లో నైపుణ్యాభివృద్దితో మహిళలను సన్నద్ధం చేయడానికి రూపొందించిన ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. సంవత్సరం పొడవునా ఉండే కార్యక్రమం. సూపర్ ప్రెసిడెంట్ సుధీర్ సండ్ర, వైస్ ప్రెసిడెంట్ నికీలు గుండా కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. తన మాటలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, ఆధునిక టెక్నాలజీలో విశేష ప్రతిభ కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ పర్ట్, డిజిటల్ కనెక్ట్ సీఈవో నికీలు గుండా కలిసి సంయుక్తంగా ఈ సూపర్ మామ్ కార్యక్రమాన్ని రూపొందించారు. SUPAR ఫౌండేషన్ కు సుధీర్ సండ్ర ప్రెసిడెంట్ గా, నికీలు గుండా వైఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ 2022 లో మనో విజ్ఞాన యాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో అనేక సెమినార్లు నిర్వహించి, వందల మందికి ఉపాధి అవకాశాలకు కావాల్సిన శిక్షణ ఇచ్చారు.

వ్యక్తిగత, వృత్తిపరమైన శిక్షణ:

సూపర్ మామ్ ద్వారా అన్ని వర్గాల మహిళలకు వ్యక్తిగత, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత టెక్నాలజీకీ అనుగుణంగా విలువైన నైపుణ్యాలను పెంపొందించడం, తద్వరా వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను సృష్టించి, మహిళలకు ఆర్థిక చేయూతను ఇచ్చే ఉద్దేశంతో ఈ SUPAR MOM ప్రోగ్రామ్ 2025న జనవరి 1 లాంఛనంగా ప్రారంభం కానుంది. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జనవరి 5న ప్రారంభమయ్యే ఈ సూపర్ కార్యక్రమంలో ప్రతి ఆదివారం శిక్షణా తరగతులు ఉంటాయి. ఏడాది పాటు మొబైల్ యాప్ ద్వారా ఈ క్లాసులను రికార్డు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.

మహిళల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది:

సూపర్ మామ్ ప్రోగ్రాం మహిళలకు కోర్సుల్లో కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా వారికి తగిన నైపుణ్యాలను నేర్పించి ఆదాయ మార్గాలను సృష్టిస్తుందని సూపర్ ఫౌండేషన్ సుధీర్ సండ్ర తెలిపారు. తద్వారా మహిళల ఆర్థిక భవిష్యత్తును నిర్దేశించి, సాధికారత కల్పించడానికి రూపొందించినట్లు తెలిపారు. మహిళలు, వారి కుటుంబాల్లో అంతకు మించి మార్పును తీసుకురావడానికి గల శక్తిని తాము విశ్వసిస్తున్నామన్నారు.

ఏడాది పొడవునా శిక్షణా కార్యక్రమాలు:

ఈ సూపర్ మామ్ ప్రోగ్రామ్‌లో 52 వారాల ఇంటరాక్టివ్ స్కిల్-బిల్డింగ్ సెషన్‌లు ఉంటాయి. ఇంటి నుండి పని చేయాలనుకునే మహిళల కోసం ఈ ప్రోగ్రామ్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతి వారం పాల్గొనేవారికి ఆర్థిక అక్షరాస్యత నుంచి ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్ వరకు వివిధ అంశాలకు సంబంధించి నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రతి సెషన్‌ లో పాల్గొన్న వారు శిక్షణ పూర్తి చేసుకున్నట్లు సర్టిఫికేట్‌లను కూడా అందుకుంటారు. వారి పోర్ట్‌ ఫోలియోలకు వృత్తిపరమైన విశ్వసనీయతను జోడిస్తుంది.

సాధారణంగా ఈ సూపర్ మామ్ ప్రోగ్రామ్ ఫీజు 4999గా నిర్ణయించారు. అయితే వీలైనంత ఎక్కువ మంది మహిళలకు చేరువ చేసేందుకు ఏడాది పాటు కేవలం రూ.999 ప్రత్యేక ఫీజుతో అందిస్తున్నట్లు సూపర్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ నికీలు గుండా తెలిపారు. ఉజ్వలమైన ఆర్థిక భవిష్యత్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న మహిళలకు కొత్త ప్రారంభానికి ప్రతీకగా నూతన సంవత్సరం రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రొగ్రామ్ కు విశేషమైన స్పందన వస్తున్నట్లు తెల్లిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3500 మంది మహిళలు ఈ సూపర్ మామ్ ప్రోగ్రామ్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నికీలు గుండా తెలిపారు.

సూపర్ మామ్ ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు:

ఫ్రీలాన్స్ అవకాశాల నుండి వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ వరకు ఏడాది పాటు నైపుణ్యాల శిక్షణ ఉంటుంది. 52 వారాలపాటు వివిధ నైపుణ్యాలపై నిపుణుల నేతృత్వంలోని సెషన్ లు. వ్యాపారాన్ని ప్రారంభించడం, ఫ్రీలాన్సింగ్, బ్లాగింగ్, ఇంటి నుండి ఆదాయాన్ని సంపాదించడానికి ఇతర మార్గాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు.
అన్ని సెషన్‌లలో పాల్గొనేవారు ప్రతి పూర్తి చేసిన మాడ్యూల్‌కు సర్టిఫికేట్‌లను అందుకుంటారు. వారి వృత్తిపరమైన ప్రొఫైల్‌లను పొందుతారు.
రోజువారి పనులలో బిజీగా ఉండే గృహిణులకు, తల్లుల ఖాళీ సమయాలకు అనుగుణంగా ఇంటి నుంచే హాజరయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

SUPAR ఫౌండేషన్ గురించి..

నైపుణ్యాభివృద్ధి, సాధికారత సూత్రాలపై స్థాపించిన SUPAR ఫౌండేషన్ భారతదేశంలోని వ్యక్తులకు విద్యా వనరులు, వర్క్‌ షాప్‌లు, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందించడానికి రూపొందించారు. ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత వృద్ధిపై దృష్టి సారించి, ఫౌండేషన్ తన సేవలను వినియోగించుకునే వారి జీవితాల్లో శాశ్వత ప్రభావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ప్రెసిడెంట్ సుధీర్ సండ్ర, వైస్ ప్రెసిడెంట్ నికీలు గుండా నాయకత్వంలో, SUPAR ఫౌండేషన్ ఒక సమయంలో ఒక నైపుణ్యాన్ని మార్చడానికి కట్టుబడి ఉంది. SUPAR MOM ప్రోగ్రామ్ గురించి మరింత సమాచారం కోసం లేదా నమోదు చేసుకోవడానికి,  www.suparfoundation.comని సందర్శించవచ్చు. లేదా ఫోన్. నం. 9676967533 లో సంప్రదించవచ్చు.