Students can study any subject from other universities: తెలంగాణ ఉన్నత విద్యామండలి విద్యార్ధులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. సాధారణంగా ఎవరైనా విద్యార్థి ఒక యూనివర్సిటీలో చేరితే.. సౌకర్యాలు సరిగా లేకున్నా, ఏ ఇతర ఇబ్బందులు ఎదురైనా కోర్సు పూర్తయ్యే వరకు అక్కడే చదువు కొనసాగించాలి. ఆ ఇబ్బందిని దూరం చేస్తూ విద్యార్థి తాను చేరిన కోర్సులో ఏదైనా ఒక పేపర్/సబ్జెక్టును ఇతర వర్సిటీల నుంచి దూరవిద్య/ఆన్‌లైన్ విధానంలో చదువుకొనే అవకాశం లభించనుంది. వచ్చే(2022-23) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇందుకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (TSCHE) వెసులుబాటు కల్పించింది. ఈ విధానం కింద దేశంలో యూజీసీ అనుమతి ఉన్న ఏ విశ్వవిద్యాలయం నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. మూక్ (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్), స్వయం వేదికలను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ఓయూలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం కోర్సులో ఒక విద్యార్థి చేరితే.. ఇక్కడ పర్యావరణ శాస్త్రం కోర్సు మెటీరియల్, బోధనా సిబ్బంధి లేకపోతే.. ఆ కోర్సును ఢిల్లీ వర్సిటీ నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఏ(హానర్స్) హిస్టరీ (BA Honours History)కోర్సు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కళాశాలలో 60 సీట్లతో ఈ కోర్సు ప్రారంభం కానుంది.
అడ్డుగోడలు తొలగిస్తున్నాం
చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు అడ్డుగోడలు తొలగించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొనివస్తున్నట్టు, ఒక యూనివర్సిటీలో చేరిన విద్యార్థి మరో వర్సిటీ నుంచి ఏదైనా ఒక సబ్జెక్టు చదువుకునే వీలు కల్పిస్తున్నామని టీఎస్సీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొ ఆర్ లింబాద్రి (TSCHE chairman R Limbadri) తెలిపారు. 40 శాతం క్రెడిట్స్ ఇతర వర్సిటీల నుంచైనా చేసుకోవచ్చని యూజీసీ సైతం చెప్పినట్లు ఆయన తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.https://tv9telugu.com/career-jobs
717633,717637,717646,717665