Telangana Jobs: యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కొత్త ప్రణాళిక.. రాతపరీక్షలు నిర్వహించే ఆలోచనలో తెలంగాణ సర్కార్

| Edited By: Sanjay Kasula

Jul 14, 2021 | 2:52 PM

తెలంగాణ సర్కార్ భారీ స్థాయిలో ఉద్యోగల భర్తీకి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మరో ముందడుగు వేయబోతోంది. ఇంతకాలం కాళీగా ఉన్న వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ

Telangana Jobs: యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కొత్త ప్రణాళిక.. రాతపరీక్షలు నిర్వహించే ఆలోచనలో తెలంగాణ సర్కార్
Osmania University
Follow us on

తెలంగాణ సర్కార్ భారీ స్థాయిలో ఉద్యోగల భర్తీకి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మరో ముందడుగు వేయబోతోంది. ఇంతకాలం కాళీగా ఉన్న వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని చూస్తోంది. ఇందుకు రాతపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. ప్రభుత్వం అనుమతిచ్చిన 1,061 పోస్టుల భర్తీకి కేంద్రీకృత విధానంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని అనుకుంటోంది.

రెండో దశలో మరికొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లను (VC)ఇప్పటికే ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మంగళవారం నాంపల్లిలోని రాష్ట్రీయ ఉచత్తర్‌ శిక్షా అభియాన్‌ (RUSA) కార్యాలయంలో 11 యూనివర్సిటీల వీసీలతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో మూడు రకాల ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది. పోస్టుల భర్తీ యూనివర్సిటీల చేతుల్లో పెట్టరాదని.. బీహార్‌ తరహాలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ద్వారా కానీ లేదా TSPSC ద్వారా భర్తీ చేయాల ఆలోచనకు వీసీలంతా ఓకే చెప్పినట్లుగా సమాచారం. రాతపరీక్ష నిర్వహణపైనా ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది.

ఈ అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ప్రభుత్వం అనుమతినిచ్చిన మేరకే నిర్ణయాలు ఉండనున్నాయి. ఈ సమావేశంలో ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావు, కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, వీసీలు ఎస్‌ మల్లేశం, రవీందర్‌, తాటికొండ రమేశ్‌, రవీందర్‌గుప్తా, కిషన్‌రావు, కట్టా నర్సింహారెడ్డి, లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, కవిత దర్యాని, సీతారామారావు, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యూనివర్సిటీలకు స్వయంప్రతిపత్తి ఉండటంతో ఇంతకాలం సొంతంగానే అవసరమైన టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ ఉద్యోగాలు భర్తీచేసుకొనేవి. అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారానే ఎంపికచేసేవారు. ఈ పద్ధతి లోపభూయిష్టంగా ఉందని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో గందరగోళానికి తావులేకుండా ఈసారి రాతపరీక్ష, ఉమ్మడి నోటిఫికేషన్‌ను జారీచేయాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : AP IPS officers: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Bride Viral Video: కారు బానట్‌పై పెళ్లి కూతురు.. సరదాగా తీసుకున్న వీడియో చిక్కుల్లో పడేసింది..