
హైదరాబాద్, నవంబర్ 30: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి(గ్రూప్ సి) పోస్టుల ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ మేరకు స్కిల్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. స్కిల్ టెస్ట్‌కు మొత్తం 8,624 మంది గ్రేడ్-సికు ఎంపికైనారు. ఇక గ్రేడ్-డి పోస్టుల స్కిల్ టెస్ట్‌కు 22,456 మంది అర్హత సాధించినట్లు కమిషన్ తన ప్రకటనలో తెలిపింది. అలాగే రిజర్వేషన్ ఆధారంగా కటాఫ్ మార్కులను కూడా వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ 2025 కటాఫ్ మార్కుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఆగస్టు 6, 7, 8, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక చివరి దశ అయిన స్కిల్ టెస్ట్‌కు కూడా తేదీలను ఎస్ఎస్‌సీ త్వరలోనే విడుదల చేయనుంది. నైపుణ్య పరీక్షపూర్తయిన తర్వాత మాత్రమే తుది ఎంపిక జరుగుతుంది. కాబట్టి ఈ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంటుంది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 261 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి పోస్టులను భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.