స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 26,146 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టులు భర్తీ కానున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), , సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన వెలువరించింది. గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులకు 157 సెంటీమీటర్లలకు తగ్గకుండా ఉండాలి.
అభ్యర్ధుల వయసు జనవరం 1, 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు జనవరి 2, 2001 కంటే ముందు, జనవరి 1, 2006 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31, 2023వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా.. తెలుగు భాషతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) మొత్తం పోస్టులు: 26,146 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ..
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.