SSC Revised Exam Dates: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024 పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

|

Apr 09, 2024 | 3:29 PM

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఏప్రిల్, జూన్ నెలల్లో జరగాల్సిన పలు పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. జూనియర్ ఇంజిరీర్లు, సీపీఓ, సీహెచ్ ఎస్ ఎల్‌తో సహా పలు పరీక్షలకు కొత్తగా తేదీలను వెల్లడించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో..

SSC Revised Exam Dates: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024 పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
SSC Revised Exam Dates
Follow us on

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఏప్రిల్, జూన్ నెలల్లో జరగాల్సిన పలు పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. జూనియర్ ఇంజిరీర్లు, సీపీఓ, సీహెచ్ ఎస్ ఎల్‌తో సహా పలు పరీక్షలకు కొత్తగా తేదీలను వెల్లడించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో నూతన తేదీలను చెక్ చేసుకోవాలని కమిషన్‌ ఈ సందర్భంగా సూచించింది.

వీటిల్లో జూనియర్ ఇంజనీర్ (వివిధ విభాగాలు) పేపర్ I పరీక్ష 2024, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ (ఫేజ్ XII), ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ పేపర్ I ఎగ్జామ్ 2024, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1, 2024 మధ్య దేశ వ్యాప్తంగా జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. దీంతో కొత్తగా పరీక్షల తేదీలను వెలువరించింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం కొత్త తేదీలు ఇవే..

  • జూన్ 4, 5, 6 తేదీల్లో జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ పరీక్షలు జూన్ 5, 6 7 తేదీల్లో నిర్వహిస్తారు
  • మే 9, 10, 13ల్లో జరగాల్సిన ఢిల్లీ పోలీస్ (ఎస్ఐ) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో (సబ్-ఇన్‌స్పెక్టర్) 2024 పేపర్ I పరీక్షలు జూన్ 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి
  • మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన సెక్షన్ పోస్టు ఎగ్జామినేషన్ ఫేజ్ – XII జూన్ 24, 25, 26 తేదీల్లో జరుగుతాయి
  • కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) (సీహెచ్ ఎస్ ఎల్) పరీక్షలు జులై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీల్లో జరుగుతాయి.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inను అభ్యర్ధులు తనిఖీ చేస్తూ ఉండాలని కమిషన్‌ సూచించింది.

ఇవి కూడా చదవండి

కొత్త పరీక్షల తేదీల షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.