SSC Constable Jobs 2025: ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.70 వేల జీతం

భారీగా కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్సెస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిపికేషన్‌ కింద మొత్తం 7,565 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులను భర్తీ చేయనుంది. పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు..

SSC Constable Jobs 2025: ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.70 వేల జీతం
SSC Constable Jobs

Updated on: Oct 02, 2025 | 5:24 PM

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఢిల్లీ పోలీస్‌ సర్వీస్‌లో.. భారీగా కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్సెస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిపికేషన్‌ కింద మొత్తం 7,565 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులను భర్తీ చేయనుంది. పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆలస్యం చేయకుండా ఏదైనా కోర్సులో ఇంటర్మీడియట్ పాసైన నిరుద్యోగులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషుల పోస్టులు: 4,408
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళల పోస్టులు: 2,496
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషుల (ఎక్స సర్వీస్‌మెన్ – ఇతరులు) పోస్టులు: 285
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషుల (ఎక్స్ సర్వీస్‌మెన్ – కమాండో) పోస్టులు: 376

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌ పాసై ఉండాలి. ఢిల్లీ పోలీస్ సిబ్బంది సంతానం, బ్యాండ్స్‌మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్ వంటి ఉద్యోగులకు అర్హతలో సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు తప్పనిసరిగా పీఈ, ఎంటీ తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ (మోటార్ సైకిల్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 21, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్‌మెంట్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 21, 2025.
  • ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: అక్టోబర్‌ 22, 2025.
  • దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబర్‌ 29 నుంచి 31 వరకు

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.