Attention! SSC CHSL 2022 కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? మరి కొన్ని గంటల్లో ముగియనున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

|

Mar 06, 2022 | 3:06 PM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL)కు దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఒక్క రోజే మిగిలుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు..

Attention! SSC CHSL 2022 కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? మరి కొన్ని గంటల్లో ముగియనున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
Online Registration
Follow us on

SSC CHSL Recruitment 2022 last date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL)కు దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఒక్క రోజే మిగిలుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఈ నెల (మార్చి) 7తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. దరఖాస్తు రుసుమును చెల్లించడానికి మార్చి 8 గడువు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే తక్షణమే అప్లై చేసుకోవల్సిందిగా కమిషన్‌ సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌ ssc.nic.inలో ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులను పూరించవల్సిందిగా తెల్పింది. కాగా ఎస్సెస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్ష ద్వారా కమీషన్ లోయర్ డివిజనల్ క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ / ట్రిబ్యునల్ మొదలైన పోస్టులను వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / భారత ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ రాజ్యాంగ సంస్థలకు / చట్టబద్ధమైన సంస్థల్లోని ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కాగా ఈ నోటిఫికేసన్‌లో మొత్తం ఖాళీల వివరాలు ఎస్సెస్సీ ఇంకా విడుదల చేయలేదు. త్వరలో విడుదల చేయనున్నట్లు తెల్పింది. ఎస్సెస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ నియామకాలను మొత్తం మూడు పద్ధతుల్లో భర్తీ చేస్తారు. టైర్-1, టైర్-2, స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ టైపింగ్‌ టెస్ట్‌.. ఈ మూడు దశల్లో పరీక్షలను నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7, 2022వరకు కొనసాగుతుంది.
  • ఆన్‌లైన్‌ ఫీజు చెల్లిండానికి చివరితేదీ: మార్చి 8, 2022.
  • టైర్‌1 పరీక్షను 2022 మేలో నిర్వహిస్తారు. టైర్‌2 తేదీ ఇంకా ప్రకటించలేదు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

THSTI Jobs 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో..ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..