AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konda Laxman University: సిద్ధిపేట కొండా లక్ష్మణ్‌ హార్టికల్చరల్ యూనివ‌ర్సిటీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

Konda Laxman bapuji Horticulture university: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హార్టీక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. సిద్ధిపేట జిల్లాలో రాజీవ్‌రహ‌దారిపై ములుగు గ్రామానికి స‌మీపంలో ఉన్న...

Konda Laxman University: సిద్ధిపేట కొండా లక్ష్మణ్‌ హార్టికల్చరల్ యూనివ‌ర్సిటీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
Skltshu
Narender Vaitla
|

Updated on: Jun 10, 2021 | 8:50 PM

Share

Konda Laxman bapuji Horticulture university: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హార్టీక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. సిద్ధిపేట జిల్లాలో రాజీవ్‌రహ‌దారిపై ములుగు గ్రామానికి స‌మీపంలో ఉన్న ఈ యూనివ‌ర్సిటీలో కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 07 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫ‌కేష‌న్‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ఫామ్‌ మేనేజర్ (01), ల్యాబ్‌ అసిస్టెంట్ (01), స్టెనోగ్రాఫర్ (01), డ్రైవర్ (02), అటెండర్ (02) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఫామ్ మేనేజ‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. హార్టిక‌ల్చ‌ర్‌/అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 34,800 వరకు చెల్లిస్తారు.

* ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. హార్టిక‌ల్చ‌ర్‌/అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ. 34,800 వ‌ర‌కు చెల్లిస్తారు.

* స్టెనో గ్రాఫ‌ర్ ఉద్యోగానికి ద‌రఖాస్తు చేసుకునే వారు బ్యాచిల‌ర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 20,200 వరకు జీతంగా చెల్లిస్తారు.

* డ్రైవ‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు జీతంగా నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.

* అటెండర్ ఉద్యోగానికి ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఏడో త‌ర‌గ‌తి పాస్ అయ్యి ఉండాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ. 20,200 వరకు చెల్లిస్తారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిపిన పోస్టుల‌ను అనుస‌రించి రాత ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 20-06-2021ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: దొంగలుగా మారిన ఖాకీలు.. తనిఖీల పేరుతో దోపిడీలు.. నిజం తెలిసిన అధికారులు షాక్..

Online gaming career: కెరీర్ గా ఆన్‌లైన్ గేమింగ్ బెటర్ అని భారతీయులు అంటున్నారు.. హెచ్‌పి ఇండియా కంపెనీ చెబుతోంది!

Drishyam’s Chinese remake: చైనీస్ భాషలోకీ రీమేక్ కానున్న సూపర్ హిట్ సినిమా..

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక