SAI Recruitment 2021: స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఈ సంస్థలో మొత్తం 100 కోచ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* మొత్తం 100 ఖాళీలకు గాను ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, కయాకింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు వంటి క్రీడా విభాగాల్లో ఉన్న కోచ్ స్థానాలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన స్థానాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్‌ఎస్ ఎన్‌ఐఎస్ / ఇతర ఇండియన్ / ఫారిన్ యూనివర్సిటీల నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత / ఒలింపిక్/ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ విజేత / ద్రోణాచర్య అవార్డు గ్రహీతలై ఉండాలి.
* అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరి తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,05,500 నుంచి రూ. 1,50,000 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను క్రీడా విజయాలు, అనుభవం, విద్యార్హతలు పరిగణలోకి తీసుకొని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 31-08-2021న ప్రారంభంకాగా 15-10-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
SVVU Recruitment: తిరుపతి ఎస్‌వీవీయూలో టీచింగ్ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులెవరంటే..