Railway Jobs: ఇండియన్‌ రైల్వేలో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

|

Oct 30, 2022 | 7:14 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్‌ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 3154 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 31తో గడువు ముగియనున్న నేపథ్యంలో..

Railway Jobs: ఇండియన్‌ రైల్వేలో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Railway Jobs
Follow us on

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్‌ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 3154 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 31తో గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 3154 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుఛ్చేరి, కేరళ, అండమాన్‌ నికోమార్‌, లక్షద్వాప్‌ ఐలాండ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* ఫిట్టర్‌, వెల్డర్‌, పెయింటర్‌, ఎంఎల్‌టీ, కార్పెంటర్‌, మెషినిస్ట్‌, వైర్‌మెన్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంధిత స్పెలైజేషన్‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, అకడమిక్‌ మెరిట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 31,2022 ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..