Indian Army: ఆర్మీలో చేరాలనుకునే యువకులకు బంపరాఫర్‌.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌కు ముగుస్తున్న గడువు..

|

Sep 20, 2022 | 12:42 PM

Indian Army Recruitment 2022: భారత సైన్యంలో చేరాలనుకునే యువకుల కోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌-48 కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి విషయం తెలిసిందే. భారత సైన్యంలో పర్మనెంట్ కమీషన్‌కు సంబంధించి..

Indian Army: ఆర్మీలో చేరాలనుకునే యువకులకు బంపరాఫర్‌.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌కు ముగుస్తున్న గడువు..
Indian Army
Follow us on

Indian Army Recruitment 2022: భారత సైన్యంలో చేరాలనుకునే యువకుల కోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌-48 కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి విషయం తెలిసిందే. భారత సైన్యంలో పర్మనెంట్ కమీషన్‌కు సంబంధించి ఈ కోర్సును నిర్వహించనున్నారు. 2023 జనవరి నుంచి ప్రారంభంకానున్న ఈ కోరసుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ రేపటితో (20-09-2022) ముగియనుంది ఈ నేపథ్యంలో.. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు తప్పనిసరిగా జేఈఈ (మెయిన్స్)-2022లో హాజరై ఉండాలి.

* విద్యార్థుల వయసు పదాహారున్నర ఏళ్ల కంటే తక్కు 19½ ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు.

* ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత స్టేజ్‌-1, స్టేజ్‌-2, ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (21-09-2022)తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..