Nursing Jobs in Germany: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు పొంచే ఛాన్స్‌.. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రం నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చి, వారికి జర్మనీలో కొలువులు దక్కించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (SEEDAP), డీఆర్డీఏ కృషి చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయూ జీకేవై) కింద..

Nursing Jobs in Germany: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు పొంచే ఛాన్స్‌.. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Nursing Jobs In Germany

Updated on: Apr 13, 2025 | 3:06 PM

విజయవాడ, ఏప్రిల్ 13: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు అధిక డిమాండ్‌ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చి, వారికి జర్మనీలో కొలువులు దక్కించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (SEEDAP), డీఆర్డీఏ కృషి చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయూ జీకేవై) కింద జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కృష్ణా జిల్లా డీఆర్డీఏ పీడీ హరిహరనాధ్ ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

వీరికి ఉచితంగా నర్సింగ్‌లో శిక్షణ అందించి జర్మనీకి విమాన ఛార్జీలు కూడా చెల్లిస్తారు. విజయవాడ భవానీపురంలోని స్కిల్ కళాశాల ఫోన్‌ నంబర్‌ 73337 సంప్రదించాలని పీడీ సూచించారు. భాష నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, ఆ భాష బీ 2 స్థాయి వరకు ఉచిత శిక్షణ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. వీరికి ఉచిత భోజన వసతితో పాటు, ఎంపికైన వారికి నెలకు రూ.2.4 లక్షల నుంచి రూ.3.10 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. విజయవాడ భవానీపురంలోని స్కిల్‌ కళాశాలలలో రేపట్నుంచి (ఏప్రిల్14) తరగతులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు 99630 74879, 94927 19843, 728888 73337 నంబర్లను సంప్రదించాలని పీడీ సూచించారు.

అగ్నివీర్ పోస్టులకు రిజిస్ట్రేషన్‌ గడువు పెంపు..  ఎప్పటివరకంటే?

భారత ఆర్మీలో చేరాలనుకునే నిరుద్యోగులకు అగ్నివీరుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువును ఏప్రల్ 25వ తేదీ వరకు పొడిగించినట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.