Railway Recruitment 2022: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 1044 అప్రెంటిస్‌ ఖాళీలు.. పదో తరగతి పాసైతే చాలు..

|

May 26, 2022 | 1:29 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకుచెందిన సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (SECR) నాగ్‌పూర్‌ డివిజన్‌లోని వివిధ విభాగాల్లో.. అప్రెంటిస్‌ ఖాళీల (Apprentice Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ..

Railway Recruitment 2022: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 1044 అప్రెంటిస్‌ ఖాళీలు.. పదో తరగతి పాసైతే చాలు..
Secr
Follow us on

SECR Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకుచెందిన సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (SECR) నాగ్‌పూర్‌ డివిజన్‌లోని వివిధ విభాగాల్లో.. అప్రెంటిస్‌ ఖాళీల (Apprentice Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 1044

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అప్రెంటిస్‌ ఖాళీలు

ఖాళీల వివరాలు:

  • నాగ్‌పూర్‌ డివిజన్‌లో 980
  • వర్క్‌షాప్‌ మోతీబాగ్‌లో 64

ట్రేడులు: ఫిట్టర్‌, కార్పెంటర్, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, డిజిటల్‌ ఫొటోగ్రాఫర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, గ్యాస్‌ కట్టర్‌, స్టెనోగ్రాఫర్‌, కేబుల్‌ జాయింటర్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మే 1, 2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.