Singareni Jobs: సింగరేణిలో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్… త్వరలో!

సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 177 మంది జూనియర్ అసిస్టెంట్లు, 39 మంది మైనింగ్ ఇంజనీర్లు, 10 మంది ఇండస్ట్రియల్ ఇంజనీర్లు, 6 ఐటీ ఇంజనీర్లు, ఇతర కేటగిరీల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు..

Singareni Jobs: సింగరేణిలో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్... త్వరలో!
Sccl Jobs

Updated on: Jan 29, 2022 | 2:53 PM

Singareni Recruitment Notification Soon: సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 177 మంది జూనియర్ అసిస్టెంట్లు, 39 మంది మైనింగ్ ఇంజనీర్లు, 10 మంది ఇండస్ట్రియల్ ఇంజనీర్లు, 6 ఐటీ ఇంజనీర్లు, ఇతర కేటగిరీల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కాగా గత ఏడేళ్ల కాలంలో 58 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ల ద్వారా 3,498 మందిని, నియామకాల ద్వారా 12,553 మందితో కలిపి మొత్తం 16,040 మందిని నియమించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ గతేడాది తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తిగా తొలగించి కేవలం రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. రాత పరీక్ష రోజునే ఫలితాలు కూడా వెల్లడించి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నియామక ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ ఏడాది కూడా సింగరేణి ఉద్యోగాలను ఈ విధంగానే భర్తీ చేసే అవకాశం ఉంది.

Also Read:

APPSC Govt Jobs: ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు తుది గడువు పొడిగింపు.. మరో వారం పాటు..