SBI Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర జీతం

SBI Specialist Officers Recruitment 2025 Notification: దేశంలోని వివిధ బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌..

SBI Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర జీతం
SBI Specialist Officer Jobs

Updated on: Oct 11, 2025 | 6:20 AM

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. దేశంలోని వివిధ బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10 మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 28, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇలా..

  • మేనేజర్‌ పోస్టుల సంఖ్య: 6
  • డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల సంఖ్య: 3
  • అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌ పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 8, 2025వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 30 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌ పోస్టులకు 35 నుంచి 45 ఏళ్లు, మేనేజర్‌ పోస్టులకు 24 నుంచి 36 ఏళ్లు ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌లో గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్షలేంకుడానే ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.1,35,020 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.