SBI PO Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ నియామకల కోసం ఈ ఏడాది జనవరి 6న పరీక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను ఎస్‌బీఐ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.inలో చూసుకోవచ్చని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎస్‌బీఐ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2000 పీఓ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించారు. తుది ఫలితాలకు సంబంధించిన అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీలను ఎస్‌బీఐ విడుదల చేసింది. అలాగే ఎంపికైన అభ్యర్తుల మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
* మొదట ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ SBi on sbi.co.inలోకి వెళ్లాలి.
* అనంతరం ‘Careers section’ సెక్షన్‌లోకి వెళ్లాలి.
* తర్వాత ‘RECRUITMENT OF PROBATIONARY OFFICERS (Advertisement No. CRPD/ PO/ 2020-21/ 12)’ లింక్ కింద ఉన్న ‘Final Result’ను క్లిక్ చేయాలి.
* వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాకు సంబంధించి పీడీఎఫ్ ఫార్మట్‌లో ఉన్న ఫైల్ ప్రత్యక్షమవుతుంది. అందులో మీ రూల్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది.