SBI Asha Scholarship: విద్యార్థులకు ఎస్‌బీఐ బంపరాఫర్‌.. రూ. 15,000 స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం..

SBI Asha Scholarship 2022: ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఔత్సాహిక విద్యార్థులకు దేశీయ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ (SBI) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్‌ షిప్‌తో ఆర్థిక సాయం..

SBI Asha Scholarship: విద్యార్థులకు ఎస్‌బీఐ బంపరాఫర్‌.. రూ. 15,000 స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం..
Sbi Asha Scholarship 2022

Updated on: Sep 08, 2022 | 6:35 AM

SBI Asha Scholarship 2022: ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఔత్సాహిక విద్యార్థులకు దేశీయ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ (SBI) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్‌ షిప్‌తో ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఇంతకీ ఈ స్కాలర్‌షిప్‌ పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి.? ఎలా అప్లై చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకునే విద్యార్థులు 6 నుంచి 12వ తరగతులు చదువుతన్న వారై ఉండాలి. గడిచిన అకడమిక్‌ పరీక్షల్లో మినిమం 75 శాతం మార్కులతో పాస్‌ అయి ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చసుకోవాల్సి ఉంటుంది.

కావాల్సిన పత్రాలు..

దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు గతేడాది అకడమిక్‌ పరీక్షల మార్క్‌ షీట్‌, ప్రభుత్వం అందించిన ఏదైనా గుర్తింపు కార్డు, ప్రస్తుత ఏడాది అడ్మిషన్‌ ధృవీకరణ పత్రం, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, ఇన్‌కమ్‌ప్రూఫ్‌ (ఫార్మ్‌ 16 ఎ/ఇన్‌కమ్‌సర్టిఫికెట్‌/శాలరీ పేస్లిప్‌), అప్లై చేసుకున్న వ్యక్తి ఫొటో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 15, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..