SBI Jobs 2022: ఎస్బీఐలో 48 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022.. రాత పరీక్ష ఎప్పుడంటే..

|

Feb 05, 2022 | 7:06 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింద అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

SBI Jobs 2022: ఎస్బీఐలో 48 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022.. రాత పరీక్ష ఎప్పుడంటే..
Sbi
Follow us on

SBI Recruitment 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింద అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు ముంబాయి లేదా బెంగళూరు లేదా దేశ వ్యాప్తంగా ఎక్కడైనా పని చేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 48

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

విభాగాలు: నెట్ వర్క్ సెక్యురిటీ స్పెషలిస్ట్, రూటింగ్ అండ్ స్విచింగ్

పే స్కేల్: నెలకు రూ.36,000ల నుంచి రూ.63,840ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఆగస్టు 31, 2021 నాటికి 40 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
  • రాత పరీక్ష (ఆన్‌లైన్ విధానం)లో మొత్తం 100 మార్కులకు 80 ప్రశ్నలకు 120 నిముషాల సమయంలో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
  • తుది ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. వీటిల్లో 75 మార్కులకు రాతపరీక్ష, 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

పరీక్ష తేదీ: మార్చి 20, 2022.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ.750
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Hyderabad Jobs 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు అలర్ట్!రూ.1,75,000ల జీతంతో  హైదరాబాద్‌లో 33 ఉద్యోగాలు.. 6 రోజులే..