RRC Railway Jobs 2026: ఎలాంటి రాత పరీక్షలేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు!

2025-26 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)- నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా క్రీడాకారులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద..

RRC Railway Jobs 2026: ఎలాంటి రాత పరీక్షలేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు!
RRC South Eastern Railway Sports Quota Jobs

Updated on: Jan 06, 2026 | 4:13 PM

కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్‌ రైల్వేలో 2025-26 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)- నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా క్రీడాకారులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 54 గ్రూడి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 10, 2026వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఖాళీల వివరాలు ఇలా..

  • గ్రూప్‌-సి (లెవెల్‌-4, లెవెల్‌-5) పోస్టుల సంఖ్య: 5
  • గ్రూప్‌-సి (లెవెల్‌-2/3) పోస్టుల సంఖ్య: 16
  • గ్రూప్‌-డి (లెవెల్‌-1) పోస్టుల సంఖ్య: 33

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్ తదితర క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వివిధ స్థాయుల్లో పతకాలు సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 9, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్ధులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగులు, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సౌత్ ఈస్ట్రన్‌ రైల్వేలో ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.