RRB Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 9000 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. మార్చి 3 నుంచి దరఖాస్తులు

|

Feb 20, 2024 | 2:00 PM

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఏప్రిల్‌ 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు కింద..

RRB Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 9000 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. మార్చి 3 నుంచి దరఖాస్తులు
RRB Railway Notification
Follow us on

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఏప్రిల్‌ 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250. జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.500 రిజిస్ట్రేషన్‌ రుజుము కింద చెల్లించాలి. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకైతే 18 నుంచి36 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకైతే 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు నెలకు రూ.19,900 వరకు జీతంగా చెల్లిస్తారు. ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్‌ వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • మొత్తం పోస్టుల సంఖ్య పోస్టుల సంఖ్య: 9000
  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టుల సంఖ్య: 1,100
  • టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టుల సంఖ్య: 7,900

ముఖ్యమైన తేదీల వివరాలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 9, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 8, 2024.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.