RRB NTPC Railway Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో రైల్వేలో 8050 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అక్టోబర్‌ 21 నుంచి దరఖాస్తులు

RRB NTPC Graduate and Under Graduate jobs 2025: దేశంలోని అన్ని రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించి నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ గ్రాడ్యుయేట్‌ అండ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టుల భర్తీకి సెంట్రలైజ్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది..

RRB NTPC Railway Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో రైల్వేలో 8050 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అక్టోబర్‌ 21 నుంచి దరఖాస్తులు
RRB NTPC Railway Jobs

Updated on: Oct 07, 2025 | 8:46 AM

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించి నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ గ్రాడ్యుయేట్‌ అండ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టుల భర్తీకి సెంట్రలైజ్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 5,000 గ్రాడ్యుయేట్ పోస్టులు, అండర్ గ్రాడ్యుయేట్‌ 3,050 పోస్టులు ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 21 నుంచి ప్రారంభమవుతాయి. ఇక అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు అక్టోబర్‌ 28, 2025 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము – శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.. రీజియన్లతో ఆర్‌ఆర్‌బీ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్‌ కింద భర్తీ చేయనున్న పోస్టుల్లో గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులకు.. గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, అండర్ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, రైళ్ల క్లర్క్ ఖాళీలను భర్తీ చేస్తారు.

గ్రాడ్యుయేట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 16 నుంచి 33 ఏళ్లు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 18 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి. జోన్లు, విభాగాల వారీగా ఖాళీల వివరాలు త్వరలో విడుదల చేయనున్న వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 21, 2025.
  • అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 28, 2025.
  • గ్రాడ్యుయేట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 20, 2025.
  • అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 27, 2025.
  • రాత పరీక్ష తేదీలు: త్వరలోనే వెల్లడి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.