RRB Group D Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) మరో శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో దాదాపు 22 వేలకుపైగా గ్రూప్‌ డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ మరి కొన్ని రోజుల్లో విడుదలకానుంది. ఈ మేరకు లెవల్ 1 పోస్టులకు సంబంధించి షార్ట్‌ ఉద్యోగ ప్రకటనను

RRB Group D Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
RRB Group D Railway Jobs

Updated on: Jan 20, 2026 | 5:44 PM

నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) మరో శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో దాదాపు 22 వేలకుపైగా గ్రూప్‌ డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ మరి కొన్ని రోజుల్లో విడుదలకానుంది. ఈ మేరకు లెవల్ 1 పోస్టులకు సంబంధించి షార్ట్‌ ఉద్యోగ ప్రకటనను తాజాగా జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కావాల్సింది ఉండగా.. జనవరి 31నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. మార్చి 2 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

మొత్తం పోస్టుల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐలో అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటన జారీ చేసింది. పూర్తి నోటిఫికేషన్‌ ఈ నెలాఖరు నాటికి వెలువడే అవకాశం ఉంది.

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్ డీ ఉద్యోగ నోటిఫికేషన్‌ 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ పీజీ 2026 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2026-27 ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జనవరి 20వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటికే ఓసారి గడువు పొడించిన ఎన్టీయే మరోమారు గడువు పొడిగించింది. తాజా ప్రకటన మేరకు జనవరి 23, 2026వ తేదీ వరకు దరఖాస్తు గడువు పెంపొందించింది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలు దేశ వ్యాప్తంగా మొత్తం 276 నగరాల్లో మార్చి నెలలో జరగనున్నాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇతర వివరాలు ఈ లింక్‌లో తెలుసుకోండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.