RRB ALP Results 2025: అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

వివిధ రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) 2025 పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్ష ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) తాజాగా ప్రకటించింది. ఈ రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు..

RRB ALP Results 2025: అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
RRB ALP Loco Pilot Exam Results

Updated on: Oct 02, 2025 | 2:49 PM

హైదరాబాద్, అక్టోబర్‌ 2: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) 2025 పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్ష ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) తాజాగా ప్రకటించింది. ఈ రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. రాత పరీక్షను జూలై 15 నుంచి ఆగస్టు 31 మధ్య దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

RRB ALP 2025 Results కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నవంబరు 3 నుంచి ఏపీ ఆర్‌సెట్‌ 2025 పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌ 2025ను నవంబరు 3 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి తిరుపతిరావు ఓ ప్రటకనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబరు 7 నుంచి చేపడతామని అన్నారు. అక్టోబర్‌ 6న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదికి ఆర్‌సెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.