
ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, జీవితంలో మీరు ఏమీ చేయలేరని అనిపించినప్పుడు.. సరిగ్గా ఇలాంటి పరిస్థితిల్లో మీరు ఏదైనా గొప్పది సాధిస్తే అందరూ నోరు మూసుకుని పడిఉంటారు. ఓ రెడ్డిట్ యూజర్ సోషల్ మీడియాలో అలాంటి ఓ విజయగాథను షేర్ చేశాడు. ఈ పోస్టులో అతడు చెప్పిన విషయాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. 10వ తరగతిలో 60 శాతం మార్కులు వచ్చినప్పుడు తమ బంధువులు తనను ఎలా ఎగతాళి చేశారని అందులో వివరించాడు. జీవితంలో తాను ఏమీ చేయలేడని ఎద్దేవా చేశారు. కానీ అతడు మాత్రం కుంగిపోకుండా కంప్యూటర్ కోర్సు చేరితే.. అప్పుడు కూడా బంధువుల సూటిపోటి మాటలు ఆగలేదు. కానీ ఇప్పుడు అతడి బ్యాంక్ బ్యాలెన్స్‌లో లక్షలు ఉన్నాయి. ఒక్క దెబ్బతో అందరి నోరు మూయించాడు. ఇంతకీ అతడెవరో.. లైఫ్‌లో అతడు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
r/Indian_flex Reddit పేజీలో Key_Landscape6399 అనే యూజర్ ఈ స్టోరీని పంచుకున్నాడు. ‘అప్పుడు నా కంప్యూటర్ కోర్సుని ఎగతాళి చేసారు… ఈరోజు నా నెల జీతం డబ్బు రూ.3.25 లక్షలు అకౌంట్లో జమయ్యాయి. ఇది నా తల్లిదండ్రుల కోసం’ అనే శీర్షికతో రెడ్డిట్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో తన స్టోరీని చెబుతూ.. ‘నేను ఒక పల్లెటూరి అబ్బాయిని. ఆర్థికంగా ఇబ్బందుల వల్ల నా కలలు అస్పష్టంగా ఉండేవి. 10వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించాను. ఓసారి నా అత్త సరదాగా ‘నువ్వు కంప్యూటర్ కోర్సు చేస్తున్నావు కదా? నెలకు రూ.1-2 లక్షలు సంపాదిస్తావా?’ అని ఎగతాళి చేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. నా తల్లిదండ్రుల ముందు నన్ను చూసి అప్పుడు అందరూ నవ్వారు. వారి మాటలకు నేను చాలా బాధపడ్డాను. కానీ ఇదంతా అక్కడే మొదలైంది. నేను ఇంజనీరింగ్ చదవలేదు. IIT కీ వెళ్ళలేదు. ప్రభుత్వ పాలిటెక్నిక్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశాను. అందరూ ‘దీని అర్థం ఏమిటి?’ అని అన్నారు. కోడింగ్, ఆటోమేషన్, క్లౌడ్ నేర్చుకోవడం ద్వారా నేను ఇంత దూరం వస్తానని అనుకోలేదు. కానీ ఇప్పుడు నేను దాని విజయాన్ని ఆస్వాదిస్తున్నాను’.
మీరు ఎక్కడి నుండి వచ్చినా, కష్టపడి పనిచేయడం ఎప్పుడూ చిన్నతనంగా భావించకండి. ఈరోజు నా ఖాతాలో NEFT ద్వారా రూ.325,099 రూపాయలు వచ్చాయి. నా జీవితంలో అతిపెద్ద క్రెడిట్ ఇది. నేను మీకు డబ్బు చూపించాలనుకోవడం లేదు. 10 నెలలు డబ్బు సంపాదించడం పెద్ద విషయంగా భావించే మా ఊరిలో రూ.3 లక్షలు సంపాదించడం సాధ్యమేనని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీకు సాధారణ నేపథ్యం ఉండి, అందరూ మిమ్మల్ని అవమానిస్తుంటే.. మీరు కన్న పెద్ద కలలను ఆపకండి! నన్ను కూడా చూసి నవ్వారు. ‘దాని వల్ల ఏమీ రాదు’ అని అన్నారు. నేడు ఏదైనా సాధ్యమే అని నిరూపించాను. నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేపథ్యం ముఖ్యం కాదు. ఆలోచన మాత్రమే ముఖ్యం. నేను బలంగా నా పరుగు ప్రారంభించాను. కానీ ఇప్పుడు జీవితమంతా నాదే అని అనిపిస్తుంది’ అంటూ తన విజయాన్ని గర్వంగా ప్రకటించాడు.
ఇక సదరు యవకుడి రెడ్డిట్ పోస్ట్ కేవలం 17 గంటల్లోనే 4 వేలకుపైగా అప్‌వోట్లు, 200కుపైగా కామెంట్లతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ రెడ్డిట్ యూజర్ స్ఫూర్తిదాయకమైన కథనానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అద్భుతం. ‘మీరు దీన్ని చేసారు. మీరు ఇంకా ఎక్కువ సాధించగలరు. ఇప్పుడు మీరు అదే మార్గంలో ఉన్న ఇతరులకు సహాయం చేయడానికి, మార్గదర్శకత్వం అందించడానికి, ప్రపంచానికి తిరిగి ఇవ్వడానికి సమయం ఆసన్నమైంది. మీరు ఇవన్నీ చేస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. శుభాకాంక్షలు’ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు ఓ యూజర్. ఇంతకీ మీరేమంటారు..?