Railway Recruitment: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే అప్రెంటిస్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? రేపే చివరి తేదీ..

|

May 23, 2022 | 6:05 AM

Railway Recruitment 2022: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (NCER) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌ ప్రధాన కేంద్రంగా పని చేసే ఈ సంస్థ రాయ్‌పూర్‌ డివిజన్‌లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

Railway Recruitment: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే అప్రెంటిస్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? రేపే చివరి తేదీ..
Follow us on

Railway Recruitment 2022: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (NCER) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌ ప్రధాన కేంద్రంగా పని చేసే ఈ సంస్థ రాయ్‌పూర్‌ డివిజన్‌లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఉన్న 1033 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 1033 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డీఆర్‌ఎం ఆఫీసర్, రాయ్‌పూర్‌ డివిజన్‌ (696), వేగన్‌ రిపేర్‌ షాప్, రాయ్‌పూర్‌ (337) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వెల్డర్,టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్,హెల్త్‌ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్‌ డీజిల్, మెకానికల్‌ ఆటో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ

* అభ్యర్థుల వయసు 01.07.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పదో తరగతి,ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తు స్వీకరణకు 24-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..