దేశవ్యాప్తంగా రైల్వేశాఖలో 3,15,823 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఇంత వరకు ఉలుకు పలుకూ లేకుండా నిమ్మకునీరెత్తినట్టుంది. ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 17,134 ఖాళీలున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సోమవారం (డిసెంబరు 12) మీడియా ఈ మేరకు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలు ఎన్నికైనా రైల్వే ఉద్యోగ నియామకాలను పట్టించుకోవడం లేదని వినోద్‌కుమార్ విమర్శించారు.
తెలంగాణ సర్కార్ ఎక్కడాలేని విధంగా పెద్దఎత్తున నియామకాలు చేపడుతోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నిర్లక్ష్యంవీడి, తెలంగాణను ఆదర్శంగా తీసుకొవాలన్నారు. రైల్వేలో ఖాళీగా ఉన్న నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.