Railway BLW Apprentice Recruitment 2021: బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బిఎల్‌డబ్ల్యూ), వారణాసి అపెంట్రిస్ పోస్టులకు జనవరి 15న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 374 ట్రైనీ (అప్రెంటిస్) పోస్టులకు భర్తీ చేసిన ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేశారు.
* మెరిట్ జాబితాను తెలుసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్ blw.indianrailways.gov.inలోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉండే ‘కెరీర్’ అనే విభాగంలోకి వెళ్లాలి.
* తర్వాత కెరీర్ విభాగంలో కనిపించే ‘BLW అప్రెంటిస్’పై క్లిక్ చేయాలి.
* మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
* వెంటనే పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.
* జాబితో మీ పేరు ఉందో లేదో సదరు పీడీఎఫ్ చూసి చెక్ చేసుకోవచ్చు.
* ఇలా కాకుండా నేరుగా ఫలితాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
మెరిట్ జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను వారణాసిలోని టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్‌లో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. నిర్ణీత తేదీన ఉదయం 10 గంటలకు అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఈ నోటిఫికేషన్ ద్వారా.. బనారస్ లోకోమోటివ్ వర్క్‌షాప్ (బిఎల్‌డబ్ల్యు) లో పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.