TS 10th Class Exams: ‘శభాష్ కల్పనా..’ పరీక్ష కేంద్రం వద్ద కమిషనర్‌ మొబైల్‌ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్‌..

|

Apr 06, 2023 | 12:31 PM

రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్ గురువారం నాడు ఎల్బీనగర్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్లేటప్పుడు గేట్ వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు లోనికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలలో భాగంగా లోపలికి వెళ్ళేటప్పుడు..

TS 10th Class Exams: శభాష్ కల్పనా.. పరీక్ష కేంద్రం వద్ద కమిషనర్‌ మొబైల్‌ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్‌..
Rachakonda Commissioner
Follow us on

కట్టుదిట్టమైన ఏర్పాట్లతో తెలంగాణలో నేడు పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేవారికి మొబైల్‌ ఫోన్‌ అనుమతి లేదని విద్యాశాఖ ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్లేటప్పుడు గేట్ వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు లోనికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఫోన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రమే వారిని లోనికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్ గురువారం నాడు ఎల్బీనగర్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.

తనిఖీలలో భాగంగా లోపలికి వెళ్ళేటప్పుడు కమిషనర్ మొబైల్ ఫోనును కూడా మహిళా కానిస్టేబుల్ కల్పన అనుమతి ఇవ్వకపోవడంతో తన ఫోనును గేటు వద్ద కానిస్టేబుల్‌కి ఇచ్చి లోనికి వెళ్ళారు. నియమ నిబంధనలను గుర్తు చేసి డ్యూటీ సక్రమంగా చేసినందుకు సదరు మహిళా కానిస్టేబుల్ కల్పనను (ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్) మెచ్చుకుని 500 రూపాయల రివార్డు ఇచ్చి అభినందనందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో మొబైల్ ఫోన్లకు ఎలాంటి అనుమతి లేదు. విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం. దీనికోసం పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేస్తున్నామని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.