Power Grid Recruitment 2023: పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 425 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే జాబ్‌ గ్యారెంటీ..

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా ఉన్న పలు రీజియన్‌ లేదా కార్పొరేట్‌ టెలికాం డిపార్ట్‌మెంట్‌లలో డిప్లొమా ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 425 పోస్టులను భర్తీ..

Power Grid Recruitment 2023: పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 425 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే జాబ్‌ గ్యారెంటీ..
PGCIL Recruitment

Updated on: Sep 07, 2023 | 8:09 PM

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా ఉన్న పలు రీజియన్‌ లేదా కార్పొరేట్‌ టెలికాం డిపార్ట్‌మెంట్‌లలో డిప్లొమా ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 425 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగినవారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు ఈ కింది అర్హతలు ఉండాలి. అవేంటంటే..

ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌-పవర్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సిస్టమ్స్‌/పవర్‌ ఇంజినీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/సివిల్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో కనీసం 70 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు సెప్టెంబర్ 23, 2023వ తేదీ నాటికి తప్పనిసరిగా 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిలో ఓబీసీ కేటగిరీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు పదేళ్లు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 23, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.300 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..

ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 2 గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రశ్నాపత్రంలో పార్ట్‌-1, పార్ట్‌-2 ఉంటాయి. పార్ట్‌-1లో 120 ప్రశ్నలకు టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ ఉంటుంది. పార్ట్‌-2లో 50 మార్కులకు సూపర్‌వైజరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటుంది. వెర్బల్‌ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ, డేటా సఫిషియెన్సీ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్, న్యూమరికల్‌ ఎబిలిటీలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి మెడికల్‌ టెస్టులకు పిలుస్తారు. ఎంపికైన వారికి ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జీతభత్యాల వివరాలు..

శిక్షణ సమయంలో నెలకు రూ.27,500 స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం గ్రేడ్‌-4 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వరకూ జీతంతో పాటు డీఏ ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.