జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా..! అయితే ఇది చూడండి.. డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘పేపాల్’ నుంచి 1000 మందికి అవకాశం..

|

Mar 04, 2021 | 6:50 PM

Paypal to Hire 1000 Engineers : దేశీయ ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సేవల సంస్థ పేపాల్ ఈ ఏడాది భారీగా నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు,

జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా..!  అయితే ఇది చూడండి.. డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘పేపాల్’ నుంచి 1000 మందికి అవకాశం..
Follow us on

Paypal to Hire 1000 Engineers : దేశీయ ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సేవల సంస్థ పేపాల్ ఈ ఏడాది భారీగా నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న డెవలప్‌మెంట్ సెంటర్లలో సుమారు 1,000 మందిని నియమించుకోనున్నట్టు తెలిపింది. ఇందులో సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, రిస్క్ అనలిటిక్స్, మిడ్-లెవెల్, బిజినెస్ అనలిటిక్స్, సీనియర్ స్థాయిల్లో నియామకాలు ఉండనున్నట్టు కంపెనీ పేర్కొంది. పేపాల్ సంస్థ భారత్‌లో ఉన్న తమ మూడు డెవలప్‌ సెంటర్లలో మొత్తం 4,500 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశీయంగా డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని, ఈ క్రమంలో తమ కార్యకలాపాలను మరింత కీలకంగా మారాయని సంస్థ అభిప్రాయపడింది.

అమెరికా తర్వాత భారత్‌లోని టెక్నాలజీ సెంటర్లు అతిపెద్దవని, దేశీయంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా వినియోగదారులు, వ్యాపార అవసరాలను తీర్చేందుకు అవసరమైన ఉత్పత్తులు, సేవలను పెంచే చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే కొత్త నియామకాలు చేపడుతున్నట్టు’పేపాల్ ఇండియా ప్రతినిధి గురు భట్ చెప్పారు. కాగా, భారత్‌లో ఏప్రిల్ నుంచి కంపెనీ సర్వీసులను ఆపేస్తున్నట్టు ఫిబ్రవరిలో పేపాల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దేశీయంగా వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టనున్నట్టు, భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయంగా తీసుకెళ్లేందుకు కృష్టి చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

మరిన్ని వార్తలు చదవండి :India vs England 4th Test: తొలిరోజు ఆధిపత్యం చెలాయించిన భారత్.. 205 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 24/1 

Redmi Note – 10 Launched : రెడ్‌మి నోట్‌ – 10 స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌డ్.. 15 వేల లోపు ధరల్లో అదిరిపోయే ఫీచర్స్..