ONGC Scholarship: ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రతిభావంతులైన యువ క్రీడాకారుల కోసం ఒక సదవకాశాన్ని తీసుకొచ్చింది. క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారికి స్కోలర్ షిప్‌ను అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ పొందడానికి అర్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఓఎన్‌జీసీ సంస్థ అందించే ఈ స్కాలర్ షిప్‌ను పొందాలంటే క్రీడాకారులు భారతీయ పౌరులై ఉండాలి. అభ్యర్థుల వయసు 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. చెస్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ క్రీడాకారులకు కనీస వయసు 10 ఏళ్లు ఉంటే సరిపోతుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన జాతీయ స్థాయి క్రీడాకారులకు సబ్ జూనియర్‌కి రూ. 15,000, జూనియర్లకు రూ. 20,000.. సీనియర్ క్రీడాకారులకు రూ. 25000 స్కాలర్ షిప్ అందిస్తారు. ఇంటర్ నేషనల్ లెవెల్ క్రీడాకారులకు సబ్ జూనియర్‌కు రూ. 20,000.. జూనియర్‌కి రూ. 25000, సీనియర్లకు రూ. 30,000 స్కాలర్ షిప్ ఏడాదికి అందిస్తారు.
ఇందుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బర్త్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్/ఆదార్ కార్డ్/టెన్త్ క్లాస్ సర్టిఫికేట్‌లలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 21-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..