ONGC Recruitment: ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు.. గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

|

Sep 08, 2022 | 6:40 AM

ONGC Recruitment: ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న ఈ మహారత్న కంపెనీ పలు విభాగాల్లో ఉన్న...

ONGC Recruitment: ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు.. గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
ONGC Dehradun Recruitment 2022
Follow us on

ONGC Recruitment: ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న ఈ మహారత్న కంపెనీ పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్, జియో సైన్సెస్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను గేట్‌-2023 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* మెకానికల్, పెట్రోలియం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కెమికల్ వంటి పలు విభాగాల్లో ఏఈఈ పోస్టులున్నాయి. అలాగే కెమిస్ట్, జియాలజిస్ట్, జియో ఫిజిసిస్ట్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 31-07-2023 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఏఈఈ (డ్రిల్లింగ్/సిమెంటింగ్) పోస్టులకు 28 ఏళ్లు మించరాదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను గేట్‌ – 2023 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలను చివరి తేదీగా నిర్ణయించనున్నారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..