ONGC Law Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC).. క్లాట్ 2022 ఆధారంగా అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టుల (Assistant Legal Advisor Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 4
పోస్టులు: అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టులు
వయోపరిమితి: జులై 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ. 60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: లా గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అడ్వకేట్‌గా కనీసం 3 ఏళ్ల ప్రాక్టీస్ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.
క్లాట్ 2022 పరీక్ష తేదీ: మే 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: